రోజూ ఖాళీ కడుపుతో అర టీ స్పూన్‌ మెంతులు తింటే..

06 March 2025

TV9 Telugu

TV9 Telugu

మెంతుల్లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. కానీ శరీర ద్రవాల్లో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక

TV9 Telugu

అందుకే ప్రతి వంటగదిలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వ్యాధుల నుంచి రక్షించడంలో బలేగా పనిచేస్తాయి

TV9 Telugu

మెంతులలో అధిక మొత్తంలో ఇనుము, భాస్వరం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ అర టీస్పూన్ మెంతులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట

TV9 Telugu

మెంతి గింజలను తినడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది 

TV9 Telugu

అధిక కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఉదయం పరగడుపున మెంతి గింజలను తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడటానికి, ప్రతి ఉదయం మెంతి గింజలు తినాలి

TV9 Telugu

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మెంతులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. మెంతులు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది

TV9 Telugu

పగుళ్లు, గాయాల నుంచి ఎముకలు కోలుకోవాల్సి వచ్చినప్పుడు కీలకంగా పనిచేసే విటమిన్‌ కె, కాల్షియంలు... మెంతుల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారీ డైట్‌లో తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి