ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఖతం.. ఇలా రెడీ చేసుకోండి..
Krishna
06 June 2026
లవంగాలలో ఉండే యూజినాల్ అనే ప్రత్యేక సమ్మేళనం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి.
యూజినాల్ సమ్మేళనం
మనం లవంగాల నీటిని తాగినప్పుడు, అందులోని యూజినాల్ జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలిస్తుంది. ఇది కడుపులో విపరీతంగా గ్యాస్ ఏర్పడటాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది.
గ్యాస్ సమస్య
ఈ నీరు శరీరంలో జీర్ణరసాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, కడుపు ఉబ్బరం దరిచేరకుండా ఉంటుంది.
జీర్ణక్రియ
లవంగాల నీరు కడుపులోని ఆమ్లత స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా మసాలా ఆహారాలు తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఎసిడిటీ నియంత్రణ
ఒక గిన్నెలో సుమారు 250 ఎంఎల్ నీటిని తీసుకుని బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో 3 నుండి 4 లవంగాలను వేయాలి. లవంగాలు వేసిన తర్వాత గిన్నెపై మూత పెట్టి మంట ఆర్పేయాలి.
తయారీ విధానం
లవంగాలలోని ఔషధ గుణాలు నీటిలోకి బాగా ఇంకడానికి దానిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నీరు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి, కావాలనుకుంటే పావు టీస్పూన్ తేనె లేదా కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఇలా ఇంకనివ్వండి
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల రోజంతా ఎసిడిటీ, గ్యాస్ రాకుండా కాపాడుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం త్వరగా తగ్గుతాయి.
ఎప్పుడు తాగాలి
లవంగాల నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ రోజుకు ఒక గ్లాసు మాత్రమే తాగాలి. అతిగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహాతోనే వాడాలి.