నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. రోగాలను షేకాడించేస్తాయ్!

18 September 2025

TV9 Telugu

TV9 Telugu

బ్లాక్‌ ఫుడ్స్‌.. ఈ పేరు వినగానే ఇవి నలుపు రంగులో ఉంటాయేమో అంటూ మొహం చిట్లించుకుంటారు చాలామంది. అయితే నిజానికి.. ఆంథోసియనిన్‌ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్‌గా పరిగణిస్తుంటారు

TV9 Telugu

ఈ పిగ్మెంట్లు నలుపు, నీలం, పర్పుల్‌.. రంగు పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయట! ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి.. ఎలాంటి అనారోగ్యంతోనైనా సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయట

TV9 Telugu

నల్ల బియ్యం.. పేరుకు తగినట్లే ఈ బియ్యం నల్లగా ఉంటాయి. ఈ ధాన్యంలో ఉండే ల్యూటిన్‌, జియాంథిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

TV9 Telugu

ఇక ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇక ఈ రైస్‌తో పులావ్‌, బిరియానీ, ఖీర్‌, పుట్టు, దోసె, ఇడ్లీ.. వంటివి కూడా తయారుచేసుకోవచ్చు

TV9 Telugu

బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్, యాంటీఆక్సిడెంట్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లాక్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది

TV9 Telugu

బ్లాక్ రైస్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శాఖాహారులకు ప్రోటీన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

TV9 Telugu

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నల్ల బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. నల్ల బియ్యంలోని ఆంథోసైనిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తాయి

TV9 Telugu

ఆహారంలో భాగంగా నల్ల బియ్యాన్ని చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఈ బియ్యం బయటి పొర ముదురు నలుపు రంగులో ఉంటుంది. ఉడికించిన తర్వాత అన్నం ఊదా రంగులోకి మారుతుంది