అజీర్తి దగ్గర్నుంచి ఆకలిని అదుపు చేసే దాకా, నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర్నుంచి చనుబాలు ఉత్పత్తి చేసే దాకా.. ఇలా ప్రతి ఒక్క సమస్యకు సర్వరోగ నివారినిలాగా బెల్లం పనిచేస్తుంది
TV9 Telugu
బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, ‘సి’, ‘డి 2’, ‘ఇ’ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం.. ఇలా బెల్లం చేసే మేలు ఎంతో
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో బెల్లం తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
చలికాలంలో కొంతమందికి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో ఒక చిన్న బెల్లం ముక్క రోజూ తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. మూడ్ బూస్ట్ అవుతుంది
TV9 Telugu
బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లంలో మంచి మొత్తంలో ఐరన్‌ను కలిగి ఉంటుంది
TV9 Telugu
కాబట్టి రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని ఐరన్ హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ బెల్లంలో దొరుకుతాయి
TV9 Telugu
అందుకే రోజుకో బెల్లం ముక్క తింటే ఎముకలు బలపడతాయి, కండరాలకు కూడా బలం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరం ఆరోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందుతుంది