ఈ చికెన్ పకోడి టేస్టే వేరబ్బా.. మరి మీరు ప్రిపేర్ చేస్తారా? సింపుల్ టిప్స్ ఇవే !

22  September 2025

Samatha

రోడ్డు పక్కన  కానీ, రెస్టారెంట్‌లలో ఉండే చికెన్ పకోడి టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా, ఇప్పుడు ఆ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే టేస్టీ చికెన్ పకోడి ప్రిపేర్ చేద్దాం.

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చికెన్ పకోడి తినడానికి ఇష్టపడతారు. అయితే దీనిని  ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చునంట. ఎలా అంటే?

కావాల్సిన పదార్థాలు, 500 గ్రా చికెన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1, కారం, గరం మసాలా 1 టీస్పూన్, ఫుడ్ కలర్, రుచికి సరిపడ ఉప్పు, నూనె

ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో శనగ పిండి, కార్న ఫ్లోర్, అల్లం వెల్లుల్లి, మసాలా , ఫుడ్ కలర్, ఉప్పు, కొద్దిగా నీరు వేసి చిక్కగా పేస్టులా చేసుకోవాలి.

తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు వేసి ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్స్ డ్  మసాలా వేసి నాలుగు గంటలు మ్యారినేట్ చేయడానికి వదిలేయాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి , పాన్ పెట్టి, కొద్దిగా నూనె పోసి, అది వేడి అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

తర్వాత నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి పక్కకు తీసుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పై కరివేపాకు, ధనియాల పొడి చల్లండి

అంతే అందరూ  ఇష్టపడే వేడి వేడి చికెన్ పకోడి రెడీ, ఈ వంటకం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇంట్లో సండే రోజు ఈ రిసిపీ చేసి ఫ్యామిలీతో ఆనందంగా ఎంజాయ్ చేయండి మరి!