బెల్లంతో తీపి వంటకాలను చేసుకుని ఆరగించడం దాదాపు ప్రతి ఇంట్లో అలవాటే. బెల్లాన్ని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే చలికాలంలో రోజూ కచ్చితంగా చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి పూట భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను తినాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని, చలికాలంలో మనకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు
TV9 Telugu
ఆయుర్వేద ప్రకారం బెల్లం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీనికి వేడి చేసే గుణం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది
TV9 Telugu
బెల్లంలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. శరీరానికి నిరంతరం శక్తిని అందిస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు
TV9 Telugu
నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. చలికాలంలో సహజంగానే ఉండే బద్దకం నుంచి బయట పడవచ్చు. యాక్టివ్‌గా పనిచేయగులుగుతారు
TV9 Telugu
సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా ఉండేందుకు గాను రోజూ బెల్లం తినమని ఇస్తారు. ఈ క్రమంలోనే బెల్లాన్ని తినడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది
TV9 Telugu
గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం, దుమ్ము, ధూళి, పొగ వంటివి తొలగిపోతాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసనాళాలు సైతం శుభ్రంగా ఉంటాయి. గాలి సరిగ్గా లభిస్తుంది
TV9 Telugu
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. గొంతు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ సైతం తగ్గుతుంది