చలికాలంలో పాలు ఇలా తాగితే.. చెప్పలేనన్ని లాభాలు!

18 November 2025

TV9 Telugu

TV9 Telugu

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో రాత్రిపూట పాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. పాలను ఇతర ఆహారాలతో కూడా కలిపి తీసుకోవచ్చు

TV9 Telugu

శీతాకాలంలో పాలను ఖర్జూరాలతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి అధిక శక్తి లభిస్తుంది

TV9 Telugu

ముఖ్యంగా శీతాకాలంలో ఖర్జూరాలు తినడం వల్ల దగ్గు, జలుబు రాకుండా నిరోధించవచ్చు. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు

TV9 Telugu

ఖర్జూరాలను వేడి పాలలో మరిగించి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది

TV9 Telugu

శీతాకాలంలో రోజుకు 2 నుండి 3 ఖర్జూరాలు తింటే సరిపోతుంది. ఇంత కంటే ఎక్కువ తినడం హానికరం. ముఖ్యంగా ఖర్జూరాలలో సహజ చక్కెర ఉంటుంది

TV9 Telugu

కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటిని తినకపోవడమే మంచిది. ఖర్జూరాల్ల ఐరన్‌ కూడా అధికంగా ఉంటుంది. అవి సహజంగా తీపిగా ఉంటాయి

TV9 Telugu

కాబట్టి పాలల్లో వీటిని కలిపిన తర్వాత వేరే దేనితోనూ కలపవలసిన అవసరం లేదు. ఖర్జూరాల తీపి సరిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, అలెర్జీలు ఉన్నవారు పాలతో ఖర్జూరాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది