పసుపు శుభప్రదం.. కూరల్లో చిటికెడు వేస్తే కొండంత మేలు!

09 October 2025

TV9 Telugu

TV9 Telugu

పసుపు అన్నమాటే శుభప్రదం. జలుబు చేసినా, జ్వరంగా ఉన్నా, దగ్గు పట్టినా.. కాస్త పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగమని ఇంట్లో బామ్మలు చెబుతుంటారు

TV9 Telugu

రోజూ పడుకునేముందు పసుపుపాలు తాగితే మంచి నిద్ర పడుతుందనీ కూడా అంటారు. కొందరయితే వర్షాలు మొదలు కాగానే పసుపులో కాస్త బెల్లం కలిపి చిన్న మాత్రల్లా చేసి ఇంటిల్లిపాదికీ పరగడుపునే మింగిస్తారు

TV9 Telugu

ఇక పులిహోరలూ, మజ్జిగపులుసులు, కూరల్లో, చారుల్లో సైతం పసుపు పడాల్సిందే. మొత్తమ్మీద పసుపు వాడని ఇల్లు దేశం మొత్తం వెతికినా కనిపించదంటే అతిశయోక్తి కాదు

TV9 Telugu

అయితే పసుపు వంటలతోపాటు, మన సంప్రదాయ పెళ్లి వేడుకల్లోనూ తప్పనిసరి. పసిడి సూత్రాలు లేకున్నా పసుపు కొమ్ము ఉంటే చాలు, పెళ్లయిపోతుంది

TV9 Telugu

పసుపు శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేయడంలోనూ సహాయపడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పీరియడ్స్‌ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది

TV9 Telugu

పసుపు యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక మందు. కాబట్టి ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు సైతం ఉపయోగపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పసుపు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

పసుపులోని పోషకాలు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. సాధారణ జలుబు నుంచి క్యాన్సర్‌ వరకూ అనేక వ్యాధుల్ని అడ్డుకోగలిగే శక్తి పసుపుకి ఉందని ఆధునిక పరిశోధకులు సైతం చెబుతున్నారు