శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలంటే.. డైలీ కాసిన్ని మొలకలు తినడం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు
TV9 Telugu
పెసలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. వీటితో తయారు చేసిన మొలకలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
పెసర పప్పు మొక్కల ఆధారిత ప్రోటీన్‌కి పవర్‌హౌస్‌గా పరిగణించబడుతుంది. మొలకలలో ఫైబర్, బి కాంప్లెక్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఉదయం మీ రోజువారీ ఆహారంలో పెసర మొలకలు తినడం మంచిది. వీటిని రోజూ తీసుకుంటే 21 రోజుల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి
TV9 Telugu
మొలకలను 21 రోజుల పాటు నిరంతరం తినడం వల్ల కండరాలు బలపడతాయి. దీని వినియోగం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి
TV9 Telugu
కండరాలతోపాటు, కీళ్ల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల పెసర పప్పు మొలకలు బరువును నియంత్రించడంలో, కండరాలను పెంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే ఇది మీ శరీరాన్ని లోపలి నుండి పోషిస్తుంది
TV9 Telugu
మొలకలు తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు మొలకలు తినకూడదు. ఎందుకంటే ప్రోటీన్ సమస్యను పెంచుతుంది. జీర్ణ సమస్యలు ఉంటే మొలకలను తేలికగా ఉడికించి తినడం బెటర్