షుగర్ పేషెంట్లకు వరం.. బోడకాకరతో బోలెడు లాభాలు!

Samatha

01 September 2025

Credit: Instagram

బోడ కాకరకాయ తెలియని వారు ఉండరు. చాలా మందికి వీటితో చేసే కర్రీ అంటే ఇష్టం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం బోడకాకర తినడం వలన కలిగే లాభాలు ఏవో చూద్దాం.

వర్షాకాలంలో ఎక్కువగా లభించే కూరగాయల్లో ఇది ఒకటి. దీనిని తినడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బోడ కాకరకాయలో విటమిన్ బీ 12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

అందువలన అనేక పోషకాలు ఉన్న బోడకాకరకాయ తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

అలాగే దీనిని కనీసం వారంలో రెండు సార్లైనా తినడం వలన ఇది జుట్టురాలే సమస్యను తగ్గించేస్తుంది. అధికంగా జుట్టు రాలేవారు వీటిని తినడం మంచిది.

చర్మాన్ని కాంతివంతమైన వాటిగా తయారు చేయడంలో ఇవి కీలకంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, మీ శరీరాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.

షుగర్ పేషెంట్స్‌కు ఇది చాలా మంచిది. ఎవరైతే మధుమేహం సమస్యతో బాధపడుతున్నారో, వారు దీనిని తినడం వలన ఇది ఇన్సులిన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

అలాగే బీపీ వంటి సమస్యతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. వర్షకాలంలో దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన వైరల్ ఫీవర్స్ నుంచి కాపాడుతుంది.