ఘాటుగా ఉండి వంటకాలకు ప్రత్యేక రుచిని అందించే వెల్లుల్లి ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది
TV9 Telugu
వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం
TV9 Telugu
ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కానీ వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోబోయే వారు మాత్రం వెల్లుల్లి వినియోగం విషయంలో ఓసారి వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు
TV9 Telugu
అధిక బరువుతో ఇబ్బందిపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమే
TV9 Telugu
ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది
TV9 Telugu
వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట
TV9 Telugu
వీటితో పాటు వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు