ప్రతి ఉదయం గుప్పెడు దానిమ్మ విత్తనాలు తిన్నారంటే..!

28 May 2025

TV9 Telugu

TV9 Telugu

చర్మం నిగనిగలాడాలని, ముడతలు పడకూడదని కోరుకుంటున్నారా? వృద్ధాప్యం త్వరగా మీద పడకూడదని భావిస్తున్నారా? అయితే రోజూ దానిమ్మ పండ్ల గింజలు తినడం మంచిది

TV9 Telugu

అవసరమైన పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్‌ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి

TV9 Telugu

దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఐరన్, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి

TV9 Telugu

దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ప్రతి ఉదయం వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానిమ్మలో ఉండే నీరు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి. నిర్జలీకరణం నుంచి రక్షిస్తాయి

TV9 Telugu

దానిమ్మలో ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరుస్తాయి. హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇది ప్రత్యేకంగా మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

దానిమ్మలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు.. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు నుంచి రక్షిస్తుంది

TV9 Telugu

దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్‌) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది. చర్మ సౌందర్యం ఇనుమడించేలా చేయటమే కాదు.. వయసుతో పాటు ఇబ్బంది పెట్టే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు తగ్గిస్తాయి