ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
31 March 2025
TV9 Telugu
TV9 Telugu
ఎండకు గొంతు తడారిపోతే.. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేవి శీతల పానీయాలు. కానీ అవి తాగినప్పుడు బాగానే ఉన్నా మళ్లీ కాసేపటికే దప్పిక వేస్తుంది
TV9 Telugu
ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్క కొబ్బరి బోండాం తాగితే పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో మరి. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు
TV9 Telugu
వేసవిలో అత్యంత ఆరోగ్యకరమైన పానీయాల జాబితాలో కొబ్బరి నీరు మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు
TV9 Telugu
కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లతో సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ దరిచేరదు. బరువు తగ్గడానికి ట్రై చేసేవారికి ఇది సరైన పానీయం
TV9 Telugu
కొబ్బరి నీళ్లలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి
TV9 Telugu
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతేకాదు.. ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. ఇందుకు దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలే కారణమని చెబుతున్నారు