రోజూ ఒక జామపండు తింటే.. మీ గుండె పదికాలాలు పదిలమే!
01 February 2025
TV9 Telugu
TV9 Telugu
పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే
TV9 Telugu
జామపండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జామలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి
TV9 Telugu
ఇక, ఈ పండులో ఉండే మెగ్నీషియం... శరీరం ఇతర పోషకాలను సరిగా స్వీకరించేలా చేస్తుంది. జామ శరీరం నుంచి హానికారక ఫ్రీరాఢికల్స్‌ను బయటకు పంపి.. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా అడ్డుకుంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకంగానూ పనిచేస్తుంది
TV9 Telugu
ఈ శీతాకాలపు పండులో విటమిన్ సి అధి్ంగా ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అందుకే ఆహారంలో సీజనల్ పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రోజూ ఒక జామపండు తినడం ద్వారా అనేక ఆరోగ్య మార్పులు చూడవచ్చు
TV9 Telugu
జామ ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో బలేగా పనిచేస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది అద్భుతమైన మందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ అధికంగా ఉంటుంది
TV9 Telugu
రోజుకొక్క జామపండు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చల్లని వాతావరణంలో సంభవించే వైరల్ వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. జామపండు తీసుకోవడం గుండెకు కూడా మేలు చేస్తుంది