రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తినే అలవాటు మీకూ ఉందా?

29 September 2025

TV9 Telugu

TV9 Telugu

ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా నిరోధిస్తాయి

TV9 Telugu

గుడ్డులోని పోషకాలు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి. జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయి

TV9 Telugu

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది

TV9 Telugu

శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి. ఉదయం పూట ఇతర అల్పాహారానికి బదులు గుడ్డు తీసుకునే వారు బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో వెల్లడైంది

TV9 Telugu

శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు

TV9 Telugu

దీంతో అనేక సమస్యలు పొంచి ఉంటున్నాయి. అందువల్ల విటమిన్ డి ఎక్కువగా ఉండే గుడ్డును ఆహారంలో చేర్చుకోవటం మంచిది

TV9 Telugu

ప్రొటీన్లతో నిండిన గుడ్డులో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి