రోజూ ఖాళీ కడుపుతో 2 కరివేపాకు రెబ్బలు తిన్నారంటే..

03 June 2025

TV9 Telugu

TV9 Telugu

కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే ఠంచన్‌గా తీసి పక్కన పెట్టేస్తాం.. కానీ ఇవి చేసే మేలు తెలిస్తే ఇప్పటి నుంచి ఆపని అస్సలు చేయం. అవును.. మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి

TV9 Telugu

దీన్ని నేరుగా, పొడి, కషాయం, పచ్చడి, స్మూథీ... ఇలా పలు రకాలుగా తీసుకోవచ్చు.బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతోపాటు రోజూ గుప్పెడు తాజా కరివేపాకు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ ఆకుల్లోని ‘కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ ఇందుకు ఉపయోగపడతాయి

TV9 Telugu

ఈ ఆకులు మధుమేహుల్లో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గుతుంది

TV9 Telugu

అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలోనూ దీని పాత్ర అమోఘమే

TV9 Telugu

కరివేపాకులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో 4-5 కరివేపాకులను నమిలి, ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే సరి

TV9 Telugu

కరివేపాకులోని ‘కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు యాంటీబయాటిక్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి