రాత్రి నిద్రకు ముందు పాలల్లో అంజీర్‌ కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

20 January 2025

TV9 Telugu

TV9 Telugu

బలహీనంగా ఉన్నవారు అంజీర్‌ తింటే.. కొన్ని రోజుల్లోనే ఆశించిన మార్పు వస్తుంది- అంటారు డాక్టర్లు. ఎందుకంటే.. అంజీర్‌లో పోషకాలు అంతపెద్ద మొత్తంలో ఉంటాయి మరి

TV9 Telugu

పీచు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాల్షియం, జింక్‌, ఫొలేట్‌, రిబోఫ్లేవిన్‌, భాస్వరం విస్తారంగా ఉన్నాయి మరి. అంజీర్‌ రక్తపోటును అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది

TV9 Telugu

పైల్స్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చర్మానికి కాంతి వస్తుంది, ముడతలు పడదు. అల్జీమర్స్‌తో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అయితే అంజీర్‌తో పాలను కలిపి తింటే చాలా పోషకాలు పుష్కలంగా అందుతాయట. పాలు, అంజీర్‌లను కలిపి రాత్రిపూట తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది

TV9 Telugu

అంజీర్ పండ్లతో కలిపిన పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. ఇది కీళ్ల, కండరాల నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది

TV9 Telugu

రాత్రిపూట నిద్రవేళకు అరగంట లేదా పావుగంట ముందు గోరువెచ్చని పాలలో అంజీర్‌ పండ్లను కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది

TV9 Telugu

అంజీర్‌, పాలు ఇవి రెండూ పోషకాల పవర్ హౌస్‌లు. రెండింటినీ కలిపి తాగడం వల్ల శరీరంలో బలహీనత తొలగిపోయి శక్తి పెరుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రి తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది