పెరుగు, సబ్జా గింజలు కలిపి తింటే ఏమవుతుందో తెల్సా?
13 April 2025
TV9 Telugu
TV9 Telugu
పాలు, పెరుగు తీసుకోవడానికి కొందరు ఆసక్తి చూపించరు. వీటివల్ల బరువు పెరుగుతామనే అభిప్రాయంలో ఉండేవారూ లేకపోలేదు. అయితే సకల పోషకాల మిళితమైన పెరుగు రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది
TV9 Telugu
అయితే వేసవిలో మాత్రం ఒంటికి చలువ చేసే చల్లని పదార్థాలు తినాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది
TV9 Telugu
హీట్ స్ట్రోక్ నుంచి కూడా పెరుగు రక్షిస్తుంది. అలాగే, వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. పెరుగు తినడం వల్ల రిఫ్రెషింగ్ అనుభూతి కలుగుతుంది
TV9 Telugu
ఇందులోని మంచి బ్యాక్టీరియా కారణంగా పేగు ఆరోగ్యానికి మంచిది. పెరుగు తింటే తాజాగా అనిపించడమే కాకుండా శక్తిని కూడా పెంచుతుంది
TV9 Telugu
అలాగే వేసవిలో సబ్జా గింజలు చల్లదనాన్ని అందిస్తాయి. కాబట్టి మీరు వాటిని కూడా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. సబ్జా గింజల్లో కాల్షియం, విటమిన్ సి వంటి అనేక ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. పెరుగు, సబ్జా గింజలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వైరల్ వ్యాధులను నివారిస్తుంది
TV9 Telugu
సబ్జా గింజలను సాధారణఃగా నిమ్మ రసంతో కలిపి డ్రింక్స్ తయారు చేసుకుని తాగుతారు. అయితే వీటిని పెరుగుతో కూడా తినవచ్చు. సబ్జా గింజలను పెరుగుతో కలిపి తింటే ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
పెరుగు, సబ్జా గింజలు కలిపి తీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని తీరుస్తుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. వృద్ధాప్యంలో కూడా నొప్పి సమస్యలను నివారిస్తుంది. సబ్జా గింజలు, పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
అయితే మీకు గుండె సమస్యలు ఉంటే, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు తీసుకోవడం మంచిది. సబ్జా గింజలు, పెరుగు రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక. మీరు ఉదయం బ్రేక్ ఫాస్‌కి పెరుగు, సబ్జా గింజలతో కలిపి తినవచ్చు