శీతాకాలంలో పాలల్లో కాసిన్ని కుంకుమ పువ్వు రేకలు వేసి తాగితే.. రోగాలన్నీ హాంఫట్‌!

19 December 2024

TV9 Telugu

TV9 Telugu

కుంకుమ పువ్వు రేకలు ఆరోగ్యాన్నిస్తాయి. అందానికి మెరుగులు దిద్దుతాయి. ఒకట్రెండు తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అత్యంత ఖరీదైన ఈ పూరేల లాభాలు చాలా మందికి తెలియదు

TV9 Telugu

కుంకుమ రంగులో ఉండటం వల్ల దీనికా పేరొచ్చింది. ఇది చాలా ఖరీదైంది. మనదేశంలో కశ్మీర్‌ ప్రాంతంలో పండుతుంది. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ

TV9 Telugu

ఈ పువ్వులోని సువాసనలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాదు దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది

TV9 Telugu

ముఖ్యంగా శీతాకాలంలో కుంకుమపువ్వు రేకులు కాసిన్ని పాలల్లో కలిపి తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కుంకుమపువ్వు కలిపిన పాలు తాగడం వల్ల శరీరానికి అనేక విటమిన్లు అందుతాయి

TV9 Telugu

ఈ పాలల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కుంకుమపువ్వు కలిపిన పాలల్లో విటమిన్ బి3 కూడా ఉంటుంది

TV9 Telugu

ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఈపాలలోని విటమిన్ డి ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. కుంకుమపువ్వులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, తద్వారా అంటువ్యాధులు, వ్యాధుల నుంచి రక్షిస్తుంది

TV9 Telugu

అందుకే మన దేశంలో ఎక్కువగా దీన్ని వంటకాల్లో వాడతారు. ఆహారంగా, ఆరోగ్యపరంగానే కాదు సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ దీన్ని వాడకం అధికమే. కుంకుమ పువ్వు నిత్యం ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్‌, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం తొలగిపోతాయి