నెల పాటు క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?

05 December 2024

TV9 Telugu

TV9 Telugu

నారింజ రంగులో అందంగా కనిపించడమే క్యారెట్లు కళ్లకేకాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం

TV9 Telugu

నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తం ఎక్కువ పోవడం లాంటి సమస్యలను నివారిస్తాయి. మెనోపాజ్‌ దశలో ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం, మూడ్స్‌ మారిపోవడం కద్దు. అలాంటప్పుడు రోజూ ఒక క్యారెట్‌ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

ముఖ్యంగా శీతాకాలంలో క్యారెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి రుచితోపాటు పోషకాలు కూడా అందిస్తాయి. క్యారెట్‌లో మంచి మొత్తంలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇది కాకుండా, ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి6, డైటరీ ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

ఆకలిని పెంచుతాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి

TV9 Telugu

క్యారెట్లతో జ్యూస్ తయారు చేసి కూడా  త్రాగవచ్చు. క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ముఖంపై సహజమైన మెరుపు సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంలో మెరుపును పెంచుతుంది

TV9 Telugu

క్యారెట్‌లో ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అలసటను తొలగించడంతోపాటు శక్తిని పెంచుతుంది

TV9 Telugu

బీటా-కెరోటిన్ అంటే విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్ జ్యూస్ తాగితే, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది

TV9 Telugu

క్యారెట్ రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్యారెట్ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, BPని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగానూఉంచుతుంది