బ్లాక్‌ కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?

12 June 2025

TV9 Telugu

TV9 Telugu

చల్లని వాతావరణంలో వేడివేడి కాఫీని ఆస్వాదించేందుకు చాలా మంది ఇష్టపడతారు. కాఫీ ప్రేమికులైతే అవకాశం దొరికినప్పుడల్లా ఓ కప్పు లాగించేస్తుంటారు

TV9 Telugu

ఇది గుండె ఆరోగ్యానికీ, ఎక్కువకాలం జీవించటానికి తోడ్పడుతున్నట్టు పరిశోధకులు సైతం చెబుతున్నారు. అయితే ఎంత కాఫీ తాగుతున్నామనేది కాదు, ఎలా తాగుతున్నామనేది ముఖ్యమని వివరిస్తున్నారు

TV9 Telugu

మధుమేహం వంటి కొన్ని దీర్ఘకాల జబ్బుల ముప్పులూ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. శరీరం మీద కెఫీన్‌ ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని రోజులో కాఫీ తాగే సమయం గుండె మీద చూపుతున్న ప్రభావాన్ని తెలుసుకోవటానికి ఈ అధ్యయనం నిర్వహించారు

TV9 Telugu

అయితే బ్లాక్ కాఫీని సిప్ చేయడం ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు అంటున్నారు. దీన్ని తాగడం వల్ల నిద్రలేమి, మగత దూరమవుతాయి. బ్లాక్ కాఫీ అలసట నుంచి ఉపశమనం కలిగించి పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది

TV9 Telugu

లివర్ ఆరోగ్యానికి కూడా బ్లాక్ కాఫీ మంచిది. అయితే బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల లివర్‌ను బలహీనపరుస్తుంది. అంటే దానిని మితంగా తాగితేనే మేలన్నమాట

TV9 Telugu

బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. కొన్ని సమయాల్లో కొన్ని ఆహారాలు తినే ధోరణిని తగ్గిస్తుంది. అందుకే కాఫీ బరువును తగ్గిస్తుంది

TV9 Telugu

మెదడు పనితీరును మెరుగుపరచడానికి బ్లాక్ కాఫీ ఉపయోగపడుతుంది. మెదడును చురుగ్గా ఉంచడానికి బ్లాక్ కాఫీని తీసుకోవచ్చు. అలసట నుంచి ఉపశమనం పొందడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా బ్లాక్ కాఫీ ఒక గొప్ప మార్గం

TV9 Telugu

అయితే, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదు. బ్లాక్ కాఫీని మితంగా తాగితే, వారి గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి రోజూ బ్లాక్ కాఫీ తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి