Jaggery

బెల్లం నీటితో పుట్టెడు లాభాలు.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగి చూడండి!

29 January 2025

image

TV9 Telugu

తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు

TV9 Telugu

తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు

బెల్లంలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అలాగే విటమిన్ ఎ, బి12లకు మంచి మూలం. అందువల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది

TV9 Telugu

బెల్లంలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అలాగే విటమిన్ ఎ, బి12లకు మంచి మూలం. అందువల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది

చాలామంది భోజనం తర్వాత బెల్లం తింటారు. కానీ రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బెల్లం, మరుసటి రోజు తినడం ద్వారా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

చాలామంది భోజనం తర్వాత బెల్లం తింటారు. కానీ రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బెల్లం, మరుసటి రోజు తినడం ద్వారా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది 

TV9 Telugu

బెల్లంను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా బెల్లం తినడం మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది

TV9 Telugu

బెల్లం జ్ఞాపకశక్తిని సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా బెల్లం తినడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రాత్రిపూట గ్లాసుడు నీళ్లలో బెల్లం ముక్క వేసి నానబెట్టిన నీటిని ఉదయం త్రాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది

TV9 Telugu

బెల్లంతో చిక్కీలు, స్వీట్లు, ఎనర్జీ బార్స్‌.. వంటివి తయారుచేసుకోవచ్చు. అలాగే పాలు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడడం మంచిదంటున్నారు నిపుణులు

TV9 Telugu

బెల్లం తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు బెల్లం తినకపోవడమే మంచిది. దీనిని తినే ముందు, ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి