రోజూ ఉదయం పూట మఖానా తింటే మర్చిపోలేని లాభాలు..

04 March 2025

TV9 Telugu

TV9 Telugu

వేల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయ ఆహారంలో భాగమైన మఖానాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు  వీటి నుంచి శరీరానికి అందుతాయి. మఖానా రుచికరమైనది మాత్రమే కాదు. ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి

TV9 Telugu

మఖానాతో పాయసం చేసుకోవచ్చు. కూరా వండుకోవచ్చు... ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు వారానికోసారి వీటిని తింటే సరి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి

TV9 Telugu

మఖానాలో మెరుగ్గా ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇర్రెగ్యులర్‌ బౌల్‌ మూమెంట్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. మఖానాల్లో ఫైటో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అలానే వీటిల్లోని ఆల్కలాయిడ్స్, సెపోనిన్స్, గాలిక్‌ యాసిడ్‌లు గుండెకు రక్షణగా నిలబడతాయి. మెగ్నీషియం రక్తప్రసరణను, ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పుని తగ్గిస్తుంది

TV9 Telugu

మఖానాలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

మఖానాలో అధిక మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది

TV9 Telugu

మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది

TV9 Telugu

ఇన్ని పోషకాలు ఉన్న మఖానాను ప్రతి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మఖానాలో సహజమైన ఉపశమన లక్షణాలు ఒత్తిడి, ఆందోళనను సైతం పారదోలుతాయి. ఫలితంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది