డ్రైఫ్రూట్స్‌లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇది రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుందామా..
TV9 Telugu
బాదం బలవర్థక ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.. వంద గ్రాముల బాదం నుంచి దాదాపు 579 కెలొరీలు అందుతాయి. సుమారు 49 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. 21 గ్రా., ప్రొటీన్లు ఉంటాయి. మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, లాంటి ఖనిజాలూ, ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా బాదంలో విటమిన్ E, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అయితే బాదంను తేనెతో కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా. ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
తేనె ఒక సహజ తీపి పదార్థం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ తేనె, బాదం కలిపి తినడం వల్ల శరీరానికి కావల్సిన తక్షణ శక్తి అందుతుందట
TV9 Telugu
ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల రోజంగా ఉత్సాహంగా ఉంటారు. ఇది రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది
TV9 Telugu
ఇందులో ఉండే ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
తేనెలో నానబెట్టిన బాదం తినడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పోషకాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని, జుట్టును లోపలి నుంచి పోషిస్తుంది
TV9 Telugu
ఈ రెండింటి కలయిక జీవక్రియను మెరుగుపరుస్తుంది. దానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది