అరటి పండ్లను బెర్రీలు, యాపిల్స్, ద్రాక్ష, నారింజ, బొప్పాయి వంటి పండ్లతో ఫ్రూట్ సలాడ్‌గా చేసుకుని తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది
TV9 Telugu
అరటి పండ్లలో ఉండే పొటాషియం కారణంగా ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది
TV9 Telugu
దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది
TV9 Telugu
దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది
TV9 Telugu
ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటి పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి
TV9 Telugu
ఇవి జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ బి6 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహద పడుతుంది
TV9 Telugu
రక్తం తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక అరటి పండును తింటే ఫలితం ఉంటుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
అరటి పండ్లలో ఉండే మాంగనీస్ కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండు రోజుకు ఒకటి తింటే చాలు. లేదంటే బరువు పెరుగుతారు