రోజూ ఖాళీ పొట్టతో యాపిల్ జ్యూస్ తాగి చూడండి..!

24 February 2025

TV9 Telugu

TV9 Telugu

ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్‌ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది

TV9 Telugu

పాంక్రియాజ్‌కు ఎంతో మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్‌ మంచి ఎంపిక

TV9 Telugu

కానీ రోజూ యాపిల్ పండ్లే కాదు.. యాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్ జ్యూస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

యాపిల్స్‌లో రిబోఫ్లేవిన్, థియామిన్, విటమిన్ బి6 ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

ఖాళీ కడుపుతో యాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల శరీర జీర్ణక్రియ చక్కగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో తగినంత మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

TV9 Telugu

ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడం సులువు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

యాపిల్ జ్యూస్‌ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. యాపిల్స్‌లో తగినంత మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది. అందువల్లనే కంటి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది