కమ్మని రుచుల ద్రాక్ష.. మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష!

10 March 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవి కాలంలో కాలంలో ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాదు... అనేక పోషకాలను అందించి అనారోగ్యాలనూ దూరం చేస్తాయి

TV9 Telugu

ఎండల్లో ద్రాక్ష చల్లదనాన్ని అందిస్తాయి. దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లలో పొటాషియం ఎక్కువ. ఇది అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

వీటిల్లోని విటమిన్‌ కె, కాపర్‌ రక్తం గడ్డకట్టడంలో ఉండే లోపాలను సరి చేసి... శక్తినీ, ఎముక బలాన్నీ పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్ని మెనోపాజ్‌ తర్వాత ఇబ్బంది పెట్టే ఆస్టియోపోరోసిస్‌ సమస్య తీవ్రతను తగ్గిస్తాయి. రక్తహీనతనూ అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, బి6,  ఫైబర్‌,  పొటాషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు కూడా ద్రాక్షలో ఎక్కువే. కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మేలు. ముఖ్యంగా ఫైటోకెమికల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గిస్తాయి

TV9 Telugu

క్యాన్సర్‌ రాకుండా అడ్డుపడతాయి కూడా. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని బయటకు పంపించి... కణాల పునరుద్ధరణలో కీలకంగా పనిచేస్తాయి

TV9 Telugu

ద్రాక్షలు రాగి, విటమిన్ K కి మంచి మూలం. శరీరానికి శక్తిని అందించడం, ఎముకలకు విటమిన్ K అందించడం వంటి అనేక విధాలుగా రాగి శరీరానికి అవసరం

TV9 Telugu

ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి, మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. ద్రాక్షలో లభించే సమ్మేళనాలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి

TV9 Telugu

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ద్రాక్షలోని పోషకాలు సహాయపడతాయి. అయితే డయాబెటిక్ రోగులు, ఇతర దీర్ఘకాల ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి