చలికాలంలో రోగాలకు దడ పుట్టించే పండు ఇది..

18 November 2025

TV9 Telugu

TV9 Telugu

డ్రాగన్‌ ఫ్రూట్‌... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ విదేశీ పండు చర్చే. ఇప్పుడు మన దగ్గరా వీటిని విస్తారంగా పండిస్తుండటంతో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది

TV9 Telugu

ఇందులో పీచు, మాంసకృత్తులు, ఇనుము, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి

TV9 Telugu

ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

నిస్సత్తువ నుంచి బయటపడాలంటే ఈ పండు ముక్కలు కాసిని తింటే చాలు. అలానే రక్తహీనతను అధిగమించాలన్నా ఐరన్‌ అధికంగా ఉండే వీటిని తీసుకోవచ్చు

TV9 Telugu

డ్రాగన్‌ పండులో ఉండే పిటయా అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ ముప్పుని అడ్డుకుంటాయట

TV9 Telugu

ఇక, ఇందులోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌ యాసిడ్, ఆస్కార్బిక్‌ యాసిడ్, ఫైబర్‌ వంటివి చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి

TV9 Telugu

ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ని మెరుగుపరుస్తాయి. ఇక దీని గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచితే, మెగ్నీషియం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

నీరు, పీచు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాదు.. బరువూ అదుపులో ఉంటుంది