రోజుకొక్క ఉడికించిన బంగాళాదుంప తిన్నారంటే..

26 February 2025

TV9 Telugu

TV9 Telugu

బంగాళదుంపలతో చేసిన వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. చాలామందిఎంతో ఇష్టంగా ఆలూతో చేసిన కూరలను ఆరగిస్తూ ఉంటారు

TV9 Telugu

అందుకే బంగాళాదుంపను కూరగాయలలో రాజు అంటారు. దీనిని సతత హరితంగా ఉపయోగిస్తారు. దీన్ని ఏదైనా కూరగాయలతో కలిపి తయారు చేసుకోవచ్చు

TV9 Telugu

బంగాళాదుంపలలో పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, విటమిన్-బి6, ఐరన్ వంటి అనేక ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలగా ఉంటాయి

TV9 Telugu

అయితే ప్రతిరోజూ ఉడికించిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు

TV9 Telugu

బంగాళాదుంపలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఉడికించిన బంగాళాదుంప ఒకటి తప్పనిసరిగా తినాలట

TV9 Telugu

ఇలా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజూ ఉడికించిన బంగాళాదుంపలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది కడుపు సంబంధిత అనేక సమస్యలను కూడా తొలగిస్తుంది

TV9 Telugu

ఉడికించిన బంగాళాదుంపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం కావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ రాదు

TV9 Telugu

ఇందులో కాల్షియం, భాస్వరం ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బంగాళాదుంపతో చేసే కూరలు, వంటకాలల్లో కూడా పలు చర్మ సమస్యల్ని తగ్గించి మేని ఛాయను పెంచే సుగుణాలూ బోలెడున్నాయి