నారింజ కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్-సి అందించే జ్యూస్.. రోజూ గ్లాసుడు తాగినా చాలు

02 June 2026

TV9 Telugu

TV9 Telugu

జామకాయ తినమంటే విసుగ్గా ముఖం పెట్టేవాళ్లే ఎక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే అది చౌక. విరివిగా దొరుకుతుంది. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోం

TV9 Telugu

కానీ అది మహిళలకీ కౌమార దశలో ఉన్న బాలికలకీ ఎంతో మేలు అని బీఎంజే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ జర్నల్‌ పేర్కొంటోంది

TV9 Telugu

ముఖ్యంగా ఐరన్‌ లోపంతో బాధపడుతూ సప్లిమెంట్లు తీసుకునేవాళ్లు వాటితోపాటు జామ రసాన్ని తాగితే హీమోగ్లోబిన్‌ శాతం వేగంగా పెరుగుతుందట. సప్లిమెంట్ల అవసరం లేకున్నా మహిళలు క్రమం తప్పకుండా జామరసం తాగితే రక్తహీనత తలెత్తదు అంటున్నారు పరిశోధకులు

TV9 Telugu

అనేకచోట్ల చేసిన 17 అధ్యయనాల ఆధారంగా- పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు. అభివృద్ధి చెందుతోన్న అనేక దేశాల్లో గర్భిణులు, బాలికల్లో రక్తహీనత సర్వసాధారణ సమస్య

TV9 Telugu

దీనివల్ల అలసట, నీరసం, ఏకాగ్రత లోపం, గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీసి మరణాలకీ కారణమవుతుంది. అలాంటి ప్రమాదాల్నీ జామ నివారిస్తుందట

TV9 Telugu

మొక్కల ఆధారిత ఆహారం నుంచి శరీరం ఇనుమును గ్రహించేందుకు జామలోని సి-విటమిన్‌ సాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే- నారింజతో పోలిస్తే వంద గ్రాముల జామ పండులో నాలుగు రెట్లు అధికంగా విటమిన్‌-సి ఉంటుంది

TV9 Telugu

విటమిన్‌-ఎ, ఫోలేట్, పీచు, కొద్దిమొత్తంలో ఇనుము కూడా ఉంటుంది. ఇండొనేషియాలో చేసిన ఓ అధ్యయనంలో దీనివల్ల హీమోగ్లోబిన్‌ పెరిగినట్లు తేలింది

TV9 Telugu

కేవలం ఐరన్‌ సప్లిమెంట్లు ఇవ్వడంకన్నా వాటికి జామరసాన్ని చేర్చినప్పుడు ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి జామకాయని తప్పకుండా ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు