పచ్చ నిమ్మ Vs  పసుపు నిమ్మ.. వీటి రంగే కాదు రుచి కూడా వేర్వేరు

20 May 2026

TV9 Telugu

TV9 Telugu

వంటింట్లో అందుబాటులో ఉండే నిమ్మకాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలోని విటమిన్‌ సి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నరాల ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా వీటి నుంచి లభిస్తుంది. శరీరం ఐరన్‌ను గ్రహించుకోవడానికి సాయపడుతుంది

TV9 Telugu

అయితే మనకు మార్కెట్లో పచ్చ, పసుపు రంగు నిమ్మకాయలు కనినిస్తాయి. చాలా మంది వీటిని ఒకే రకంగా పరిగణిస్తారు. అయితే మీకు తెలుసా ఈ నిమ్మకాయల రంగులోనే కాదు రుచిలోనూ ఎంతో తేడా ఉంది

TV9 Telugu

మనలో చాలా మంది పసుపు రంగు నిమ్మకాయలను పండినవిగా, పచ్చివాటిని పండనివిగా తరచుగా భావిస్తాం. కానీ ఇది నిజం కాదు. పసుపు నిమ్మకాయను నిమ్మ అని పిలుస్తారు. అయితే పచ్చ నిమ్మకాయను లైమ్ అని పిలుస్తారు. రెండూ సిట్రస్ పండ్లే. కానీ వాటి జాతులు వేర్వేరు

TV9 Telugu

నిమ్మకాయను శాస్త్రీయంగా సిట్రస్ ఆరంటిఫోలియా అని, నిమ్మపండ్లను సిట్రస్ లిమోన్ అని పిలుస్తారు. ఇవి రుటేసియే కుటుంబానికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండింటిలోనూ అనేక రకాలను పండిస్తారు

TV9 Telugu

ఈ రెండు రకాల నిమ్మకాయలు మన దేశంలో పండిస్తారు. నిమ్మ సాగుకు ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణాలు అవసరం కాగా, సిట్రస్ జాతి నిమ్మకాయ సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో సౌకర్యవంతంగా పెరుగుతుంది

TV9 Telugu

నిమ్మకాయ, నిమ్మపండు రంగులో మాత్రమే కాకుండా, వాటి తొక్కల ఆకృతిలో కూడా తేడాలు ఉంటాయి. ఉదాహరణకు పసుపు రంగు నిమ్మకాయలు పెద్దవిగా, కొద్దిగా గుండ్రంగా ఉంటాయి. అయితే ఆకుపచ్చ నిమ్మకాయలు చిన్నవిగా, పూర్తి గుండ్రంగా ఉంటాయి

TV9 Telugu

నిమ్మకాయ.. నారింజ రుచి, సువాసనలో విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటి ఉపయోగాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. పసుపు రంగు నిమ్మకాయలు కొద్దిపాటి తీపి, పులుపు,తాజా సువాసనను కలిగి ఉంటాయి. పచ్చి నిమ్మకాయలు మరింత ఘాటైన పులుపు,బలమైన సువాసనను కలిగి ఉంటాయి

TV9 Telugu

కొన్ని రకాల పచ్చి నిమ్మకాయలు కూడా పసుపు రంగులోకి మారతాయి. కానీ వాటి ఉపయోగాలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు పచ్చి నిమ్మకాయలను కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్, స్పైసీ చట్నీలు, మెక్సికన్ ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే పసుపు రంగు నిమ్మకాయలను ఎక్కువగా లెమనేడ్, సలాడ్ డ్రెస్సింగ్‌లు, బేకింగ్‌లో ఉపయోగిస్తారు