తెల్లారగానే తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాఫీ, టీ ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని భావిస్తాం. వీటికి బదులుగా ఉదయం గ్రీన్ టీని తాగారనుకోండి..ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు
TV9 Telugu
అయితే కొంత మంది ఘుమఘుమలాడే కాఫీ రుచులను ఉదయాన్నే ఆస్వాదించనిదే రోజును ప్రారంభించలేరు. ఇది మీ శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని ఇస్తుంది
TV9 Telugu
దాదాపు చాలా మందీ ఉదయం నిద్రలేచిన తర్వాత కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. బరువు తగ్గడం విషయానికి వస్తే అధిక మంది గ్రీన్ టీ కాకుండా, ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగేందుక ఉష్టపడతారు
TV9 Telugu
అయితే ఆరోగ్యంగా ఉండటానికి కాఫీ తాగాలా? లేదంటే గ్రీన్ టీ తాగాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పాలీఫెనాల్ (ఎపిగాల్లోకాటెచిన్-3-గాలెట్) వంటి అత్యంత సమృద్ధిగా ఉండే మొక్కల ఆధారిత సమ్మేళనం
TV9 Telugu
ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అదే కాఫీలో రిబోఫ్లేవిన్, నియాసిన్, థియామిన్, పొటాషియం, అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
చాలా మంది బ్లాక్ కాఫీని ప్రీ-వర్కౌట్‌గా తాగుతారు. మరికొందరు బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతారు. యాంటీఆక్సిడెంట్లను పరిగణనలోకి తీసుకుంటే గ్రీన్ టీ తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
గ్రీన్ టీతో పోలిస్తే కాఫీ వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడటం, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం, రక్తంలో చక్కెరను నిర్వహించడం, గుండె జబ్బులను నివారించడం వంటి లాభాలు పొందొచ్చు