గ్రీన్‌ మిర్చీ.. రెడ్‌ మిర్చీ.. ఏది ఆరోగ్యానికి మంచిది?

25 February 2025

TV9 Telugu

TV9 Telugu

కూర, చారుల్లో ఒకటి రెండు మిర్చి వేస్తే చక్కటి రుచీ, పరిమళం వస్తాయి. రోటీ పచ్చడి చేస్తే నోరూరాల్సిందే. ఇక మిర్చిబజ్జీ గురించి చెప్పాల్సిందేం లేదు

TV9 Telugu

రుచి సంగతి అలా ఉంచితే మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిలో సి-విటమిన్‌ విస్తారంగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్యాన్ని తరిమేస్తుంది

TV9 Telugu

మనసును హాయిగా ఉంచుతాయి. మిర్చీ రుచి, పరిమళం నోటికి హితవుగా ఉంటాయి. జీర్ణప్రక్రియ బాగుంటుంది. చర్మానికి కాంతినిస్తాయి. ఇందులో ఉండే ఎ-విటమిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అందుకే ఇది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన భాగంగా మారిపోయాయ్‌.. 

TV9 Telugu

అయితే పచ్చి మిర్చీ, ఎర్ర మిర్చీ.. రెండు రకాలు మిరపకాయలు లభ్యమవుతాయి. వీటిల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమో చాలా మందికి క్లారిటీ ఉండదు

TV9 Telugu

నిజానికి, పచ్చి- ఎర్ర మిర్చీల మధ్య చాలా పోలిక ఉంది. ఈ రెండింటికీ తినడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు అందుతాయి. పచ్చి మిర్చీలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఎర్ర మిర్చీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఆయుర్వేదం ప్రకారం ఓ చెంచా ఎర్ర మిర్చీని ఏడాది పాటు తింటే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువట. అయితే అసిడిటీ లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారు మిరపకాయలు తినకూడదు

TV9 Telugu

అలాగే మిర్చీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇది కడుపులోని పేగుల సున్నితమైన పొరను దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు వస్తాయి

TV9 Telugu

అలాగే మిర్చీ ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వస్తుంది. ఏదైనా అధికంగా తీసుకోవడం హానికరం. కాబట్టి మిర్చీని సరైన పరిమాణంలో తీసుకుంటేనే ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు