వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నుండి కణాలను రక్షిస్తాయి
TV9 Telugu
దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది
TV9 Telugu
ఇది ఎముకల సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది
TV9 Telugu
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఋతుక్రమం ఆగిన మహిళల్లో వచ్చే ఎముకల పగుళ్లు, బోలు ఎముకల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి
TV9 Telugu
అలాగే క్రీడాకారులు, ఆటలు ఎక్కువగా ఆడే వారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శారీరక ధృడత్వాన్ని, శక్తిని అందిస్తాయి
ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది
TV9 Telugu
పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తద్వారా శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది