రాత్రి భోజనంలో వీటిని తిన్నారో.. మీకు కునుకు కరువే!

15 June 2025

TV9 Telugu

TV9 Telugu

కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది

TV9 Telugu

చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుంది. మొత్తంగా శారీరక, మానసిక, సామాజిక ఉన్నతికి తోడ్పడుతుంది. అయితే రోజుకు ఎంత నిద్ర అవసరమనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది

TV9 Telugu

మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారంతో పాటు సరిగ్గా నిద్రపోవాలి. అయితే మీరు తినే ఆహారం కూడా సరిగ్గా నిద్రపోకపోవడానికి ఒక కారణం అని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అయితే రాత్రి పడుకున్నాక చక్కని నిద్ర పట్టాలంటే మీరు పడుకునే ముందు ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

రాత్రిపూట మాంసాహారాన్ని నివారించడం మంచిది. ఎందుకంటే ఇందులో కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణంకావు. దీంతో నిద్రకు భంగం కలిగిస్తాయి

TV9 Telugu

సుగంధ ద్రవ్యాలుతో తయారు చేసిన ఆహారాన్ని కూడా రాత్రి భోజనంలో తీసుకోకూడదు. కారంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి

TV9 Telugu

కొంతమంది రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగుతారు. ఈ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. పడుకునే ముందు టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది

TV9 Telugu

అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు కలిగిన జంక్ ఫుడ్స్ సులభంగా జీర్ణం కావు. రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి