చూడ్డానికి చిన్నగా ఉన్నా, మెంతులతో ఆరోగ్యానికి చాలా లాభమని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వీటిని నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయట
TV9 Telugu
ముఖ్యంగా మెంతులు శీతాకాలంలో విస్తృతంగా వినియోగిస్తారు. వీటిని ఈ సీజన్ అంతా వివిధ వంటకాల్లో వినియోగిస్తుంటారు. ఇవి రుచికరంగా, ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే అందుకు కారణం
TV9 Telugu
మసాలా దినుసుల నుంచి ఊరగాయల వరకు ప్రతిదానిలోనూ ఉపయోగిస్తారు. ముఖ్యంగా నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
TV9 Telugu
ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారు 11 గ్రాముల మెంతి గింజలలో 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 3.72 మిల్లీగ్రాముల ఐరన్, రోజువారీ అవసరంలో 6 గ్రాముల మాంగనీస్, 21.3 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటాయి
TV9 Telugu
ఈ గింజల్లో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడుతుంది. మెంతులుల్లోని పీచు, ఆల్కలాయిడ్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సాయపడతాయి
TV9 Telugu
నేటి కాలంలో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతి గింజల నీళ్లు తెగ తాగేస్తున్నారు. కానీ ఇవి అందరికీ మేలు చేయవు. కొందరు ఈ నీళ్లు తాగితే తీవ్ర దుష్ర్ఫభావాలు ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
ముఖ్యంగా పిత్త శరీర స్వభావం ఉన్నవారు మెంతి గింజలను తినకూడదు, దాని నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది అజీర్ణ అవకాశాలను పెంచుతుంది
TV9 Telugu
కాలేయ సంబంధిత రుగ్మతలు ఏవైనా ఉంటే మెంతి గింజలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా మెంతి గింజలను తీసుకోవడం అంత మంచిది కాదు