ఆరోగ్యానికి మేలు చేసే అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రొటీన్లు ముఖ్యమైనవి. ఎముకలు కదలాలన్నా... కండరాలు పెరగాలన్నా... కీళ్లు పనిచేయాలన్నా... ఇవే ఆధారం. ఒక్కమాటలో చెప్పాలంటే అవి మన శక్తి భాండాగారాలు
TV9 Telugu
సంపూర్ణ ఆరోగ్యం కోసం వాటి లోటు లేకుండా చూసుకోవాలి. మాంసాహారంలో ప్రొటీన్లు పుష్కలంగా దొరుకుతాయి... మరి శాకాహారంలోనో... అంతకు మించి దొరుకుతాయి ప్రొటీన్లు ఎందులో బాగా దొరుకుతాయి..? ఠక్కున... చికెన్, చేపలు, గుడ్లు... ఇలా మాంసాహార జాబితా చదివేస్తాం
TV9 Telugu
మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మాత్రమేకాకుండా జున్ను, పప్పులు, సోయాబీన్, క్వినోవా, వేరుశెనగలు, చియా గింజలు, బాదం వంటి శాఖాహార ఆహారాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఆరోగ్యానికి మంచిది కదాని ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం ఎముకలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అందరూ అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఇది ఎముకల సాంద్రతను కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది
TV9 Telugu
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ప్రోటీన్ ఫుడ్ సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. దీని కారణంగా పదే పదే తినాలనే కోరిక ఉండదు. దీంతో బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
పూర్తి ప్రోటీన్లలో శరీరానికి అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి నాన్-వెజ్, పాల ఉత్పత్తులలో కనిపిస్తాయి. అసంపూర్ణ ప్రోటీన్లలో కొన్ని అమైనో ఆమ్లాలు ఉండవు. ఇవి ధాన్యాలు, గింజలలో లభిస్తాయి
TV9 Telugu
జుట్టు బలహీనంగా మారి రాలిపోవడానికి ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. ప్రోటీన్ జుట్టును బలపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అందువల్ల జుట్టుకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం
TV9 Telugu
ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. మన శరీరం కార్బోహైడ్రేట్లు, కొవ్వును నిల్వ చేయగలదు. కానీ ప్రోటీన్‌ను నిల్వ చేయలేదు. దీని అర్థం మనం ప్రతిరోజూ తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి