పచ్చి బఠాణీ.. ఆకుపచ్చ ముత్యాల్లా ఎంత అందంగా ఉంటాయో కదా! చూస్తుంటేనే నోట్లో వేసుకోబుద్ధేస్తుంది. బఠాణీలను క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బంగాళదుంప, క్యారెట్.. ఇలా దేనితో కలిపి వండినా వాటి రుచి బలే ఉంటుంది
TV9 Telugu
బిర్యానీ, కిచిడీల్లో ఇవి గనుక లేకపోతే.. పెద్ద లోటుగానే ఉంటుంది. వీటితో స్వీట్లు, హాట్లు కూడా చేయొచ్చు. సూప్, సలాడ్ రూపంలోనూ సేవించవచ్చు. బఠాణీల్లో ఎన్ని సుగుణాలున్నాయంటే..
TV9 Telugu
పచ్చి బఠాణీలు ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి
TV9 Telugu
బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచుగా బఠాణీలు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. వీటిలో ఉన్న సెపోనిన్స్ ద్రవ్యాలు క్యాన్సర్ నుంచి రక్షణనిస్తాయి
TV9 Telugu
బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. ఇన్ని లాభాలు ఉన్న బఠాణీ పంటకు శీతాకాలంలో డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా బఠాణీ పంట మన దేశంలో అత్యధికంగా పండిస్తారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బఠాణీలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగానే దేశం నుంచి పలు దేశాలకు బఠానీలు కూడా అధిక మొత్తంలో ఎగుమతి అవుతాయి
TV9 Telugu
బఠానీ సాగు యూపీ, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. వోల్జా ఇండియా ఎగుమతి డేటా ప్రకారం బఠాణీ భారత్ నుంచి అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్‌లకు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతాయి
TV9 Telugu
2023 సంవత్సరంలో సౌదీకి 5,800,190 కిలోలు, యుఏఈకి 3,827,520 కిలోలు, అమెరికాకు 1,062,330 కిలోల బఠానీ భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచంలో బఠానీలను ఎక్కువగా ఎగుమతి చేసే మూడు దేశాలు భారత్‌తోపాటు చైనా, పోలాండ్