వాము గురించి తెలిసినంతగా వామాకు గురించి చాలా మందికి తెలియదు. ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది
TV9 Telugu
ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికీ ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులోని ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కల్ని తెచ్చి మరీ పెంచేస్తారు
TV9 Telugu
వామాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వాము ఆకుల రసం తాగడం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఇందులో థైమోల్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఈ ఆకుల్లో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. దీని రసం తాగడం వల్ల అనేక కడుపు సమస్యలు, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆకు వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది. కఫం పడుతున్నట్టయితే గ్లాసుడు నీళ్లలో రెండు వామాకులను మరిగించి వడకట్టి తాగితే ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం
TV9 Telugu
ఆకులలో విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
దీని నుంచి వచ్చే సువాసన కూడా మనసును రిఫ్రెష్ చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిదికదాని మరీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది కడుపు చికాకు, గ్యాస్, విరేచనాలు వంటి వివిధ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి తక్కువ పరిమాణంలోనే తినాలి