గుడ్డులోని పచ్చసొన.. తెల్లసొన.. ఏది ఆరోగ్యానికి మంచిది?

20 July 2025

TV9 Telugu

TV9 Telugu

గుడ్లు మంచి పోషక గనులు. ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలీన్, ల్యూటీన్, జియాగ్జాంతీన్‌ వంటి పోషకాలూ ఉంటాయి

TV9 Telugu

గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది. అందుకే కొందరు తెల్లసొన మాత్రమే తింటుంటారు. అయితే గుడ్లలోని కొవ్వు చాలావరకూ అన్‌సాచ్యురేటెడ్‌ రకాలకు చెందిందే. ఇలాంటి రకం కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు

TV9 Telugu

కొందరికి గుడ్లు పడకపోవచ్చు. వీటిని తింటే అలర్జీ రావొచ్చు. సుమారు 2% మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపిస్తుంటుంది. పిల్లల్లో రోగనిరోధకశక్తి పరిపక్వమయ్యాక.. అంటే దాదాపు ఏడాది వయసులో గుడ్డును తినటం అలవాటు చేస్తే అలర్జీ తలెత్తకుండా చేయొచ్చు

TV9 Telugu

గుడ్లు చాలా పోషకమైన ఆహారం అయినప్పటికీ కొందరు అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని ఆహారంలో చేర్చుకోవడానికి సందేహిస్తుంటారు. ముఖ్యంగా గుడ్డు పచ్చసొన తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం

TV9 Telugu

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండింటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కేలరీల గురించి చితించేవారు గుడ్డులోని తెల్లసొన తినడం మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్డులోని తెల్లసొన తినడం మంచిది

TV9 Telugu

గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు. మొత్తం గుడ్డులో 3.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఎటువంటి ఆందోళన లేకుండా గుడ్డులోని తెల్లసొన తినవచ్చు. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి

TV9 Telugu

ఇవి శరీరంలో బహుళ శారీరక విధులకు సహాయపడతాయి. కండరాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే ఖనిజం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

గుడ్డు పచ్చసొనలో కేలరీలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు A, D, E, K , B, భాస్వరం, ఇనుము, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు దీనిని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు