పులుపు, తీపి, వగరు కలగలిపిన రుచిలో మజాగా ఉండే జామ మనందరికీ పరిచయమే. ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ పండులో శరీరానికి మేలు చేసే కీలక విటమిన్లు, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి అనేక అనారోగ్యాలను నియంత్రించడమే కాదు... మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ పెంపొందిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా అమెరికా పోషకాహార సంస్థ చేసిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఫలితాలెన్నో కనిపించాయి
TV9 Telugu
జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది
TV9 Telugu
జామపండు తక్కువ కేలరీల పండు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
జామకాయలో విటమిన్ సి, ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టును బలంగా చేస్తుంది
TV9 Telugu
జామకాయ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
TV9 Telugu
ఇది అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయబెటిస్ పేషెంట్లు దీనిని తినడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది