కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది
TV9 Telugu
పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి. పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి
TV9 Telugu
రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి. అలాగే నిత్య జీవితంలో పెరుగును పలరకాల వంటకాల్లో కూడా వినియోగిస్తుంటాం. అయితే కొన్ని పదార్థాలతో పెరుగును కలపకపోవడమే మేలంటున్నారు నిపుణులు
TV9 Telugu
పెరుగుతో తయారుచేసే రైతాలో ఉల్లిపాయలు వేయడం చాలామందికి అలవాటే! అయితే ఈ కాంబినేషన్ అందరికీ సరిపడదని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
పెరుగులో ఉండే చలువ, ఉల్లిపాయల్లో ఉండే వేడి.. ఈ రెండూ కలవడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు, చర్మ అలర్జీలు వంటివి వచ్చే అవకాశాలున్నాయట. చేపలు, పెరుగు.. ఈ రెండూ కలిపి తీసుకోకూడదన్న విషయం చాలామందికి తెలిసిందే!
TV9 Telugu
ఎందుకంటే ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. తద్వారా అజీర్తి సమస్య తలెత్తుతుంది. అంతేకాదు.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఇతర మాంసాహారంతోనూ దీన్ని కలపకపోవడమే మేలంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఇక మినప్పప్పుతో చేసిన పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే కొంతమందిలో విరేచనాలు, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం.. వంటి సమస్యలొస్తాయట
TV9 Telugu
నూనె పదార్థాలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ కాంబినేషన్ కొంతమందిలో నీరసం, మగత వంటి వాటికి కారణమవుతుందట