బిర్యానీ.. తిన్న వెంటనే వీటిని తిన్నారో కథ కంచికే!

06 July 2025

TV9 Telugu

TV9 Telugu

బిర్యానీ.. మాంసంతో చేసినా... కూరగాయలతో చేసినా... దాని ఘుమఘుమలకు చవులూరాల్సిందే... ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే వహ్వా అనాల్సిందే... ఇది కేవలం ఆహారమే కాదు..ఓ సాంస్కృతిక చిహ్నం

TV9 Telugu

అందుకే హైదరాబాదీలైనా, అవధ్‌ వాసులైనా, చెట్టినాడ్‌ ప్రజలైనా, మలబార్‌ తీరంలో వాళ్లయినా తమదైన రుచులను జోడించి సొంత వంటకంగా మార్చేసుకున్నారు

TV9 Telugu

బిర్యానీలను ఎక్కువగా పెద్ద హండీల్లో వండుతుంటారు. కాలక్రమంలో పలు మార్పులు చోటుచేసుకుని, వినూత్నంగా వండుతూ ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తున్నారు

TV9 Telugu

వెదురు బొంగు బిర్యానీ, గోంగూర బిర్యానీ, పొట్లం బిర్యానీ.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. రుచికరమైన బిర్యానీ కారంగా ఉండటమే కాకుండా కాస్త నూనెగా కూడా ఎక్కువగానే ఉంటుంది 

TV9 Telugu

బిర్యానీ ఎంత శక్తిమంతమైనా, రుచికరమైనా దాన్ని అతిగా తినకూడదు. అందులో తగిన మోతాదులోనే నూనె వాడాలి. చికెన్, మటన్‌ బిర్యానీలతో అందులోని మాంసాల వల్ల శరీరానికి ఐరన్‌ లభిస్తుంది

TV9 Telugu

మొక్కలు, ఆకుకూరలతో చేసిన వంటకాల ద్వారా కేవలం 5శాతం ఐరన్‌ లభిస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి బిర్యానీ మంచి ఆహారం. కావాల్సిన ఐరన్‌ చేరడంతో రక్తం వృద్ధి చెందుతుంది. అయితే బిర్యానీతో ఒకేసారి ఎక్కువ మోతాదులో కాలరీలు శరీరానికి చేరతాయి

TV9 Telugu

అయితే బిర్యానీ తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తినకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ తిన్న వెంటనే సోడా శీతల పానీయాలు, ఖీర్, రసమలై, ఐస్ క్రీం వంటి తీపి వంటకాలు తినడం అస్సలు మంచిది కాదు. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి

TV9 Telugu

నారింజ, నిమ్మకాయలు, పుచ్చకాయ వంటి పండ్లు కూడా తినకూడదు. అలాగే మిల్క్ షేక్స్, పాలు, ఊరగాయలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ లేదా టీ వంటివి అస్సలు తీసుకోకూడదు. ఇవి అసిడిటీ సమస్యలు కలిగిస్తాయి. బిర్యానీ తిన్న తర్వాత సోంపు తినవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీరు లేదా మజ్జిగ తాగవచ్చు