రోజూ మాంసం తింటున్నారా..? ఆ సమస్యలకు లైఫ్‌లైన్ ఇచ్చినట్టే
11 August 2025
Ravi Kiran
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతేకాదు చాలామంది వారానికి ఓసారి, లేదా మూడు సార్లు అయినా మాంసం తింటుంటారు. మరి అలాంటి వారికి ఓ షాకింగ్ న్యూస్
ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవారు ఎక్కువకాలం జీవించలేరని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టి.. అందులో కీలక విషయాలు వెల్లడించారు.
ఈ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో రోజూ లేదా వారానికి మూడు కంటే ఎక్కువ సార్లు ప్రాసెస్డ్ & రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది.
సుమారు 4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు.
ఏది తిన్నా మితంగా తినాలని డాక్టర్లు చెబుతారు. ఇది కూడా అంతే.! పరిమితంగా మాంసం తినొచ్చునని.. ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని దరి చేరకుండా చేసుకోవచ్చునని చెప్పారు.
ప్రతీ రోజూ మాంసం తినడం వల్ల నరాల సమస్య తలెత్తవచ్చునని పరిశోధకులు చెప్పారు. అందుకే మీ డైట్, ఆహరంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు లాంటి ఆహారపు అలవాట్లను మొదలుపెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బయట తిండి బదులు ఇంట్లో తిండినే ప్రిఫర్ చేయమని చెబుతున్నారు.
రోజూ 8 గంటల నిద్ర, రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం.. రోజూ అరగంట పాటు వ్యాయామం లేదా నడవడం.. ఒత్తిడికి గురికావడం లాంటివి లేకపోతే మీరు బరువును కంట్రోల్‌లో ఉండొచ్చు.