పెరుగు ఇలా తింటే రోగాలు క్యూ కడతాయ్!

23 October 2025

TV9 Telugu

TV9 Telugu

మన నిత్య జీవితంలో పెరుగును చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటాం. కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారు యవ్వనంగా ఉంటారని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి  మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి

TV9 Telugu

పెరుగును వివిధ వంటకాల్లోనూ వినియోగిస్తుంటాం. అయితే కొన్ని పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి పడకపోవచ్చని, అలాంటి సందర్భాలలో అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు

TV9 Telugu

చేపలు, పెరుగు.. ఈ రెండూ కలిపి తీసుకోకూడదన్న విషయం చాలామందికి తెలిసిందే! ఎందుకంటే ఈ రెండింటిలోనూ ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి

TV9 Telugu

తద్వారా అజీర్తి సమస్య తలెత్తుతుంది. అంతేకాదు.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఇతర మాంసాహారంతోనూ దీన్ని కలపకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు

TV9 Telugu

మినప్పప్పుతో చేసిన పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే కొంతమందిలో విరేచనాలు, కడుపుబ్బరం.. వంటి సమస్యలొస్తాయి

TV9 Telugu

నూనె పదార్థాలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందిలో జీర్ణ ప్రక్రియ నెమ్మదింపజేసి బద్ధకం, మగత వంటి సమస్యలకు కారణమవుతుంది. పెరుగు చట్నీలో ఉల్లిపాయలు వేయడం ఈ కాంబినేషన్ కూడా కొందరికి పడకపోవచ్చు 

TV9 Telugu

ఈ రెండూ కలవడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు, చర్మ అలర్జీలు వంటివి వస్తాయి. అందుకే ఈ పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుండా దూరంగా ఉండడమే మంచిదన్నది నిపుణులు సలహా ఇస్తున్నారు