ఈ ఆకుల్ని గుర్తుపట్టారా? పొద్దున్నె 2 నోట్లో వేసుకుంటే..

02 October 2025

TV9 Telugu

TV9 Telugu

పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి కేవలం దీన్ని కూరల్లో వినియోగించడమే కాదు... ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది

TV9 Telugu

బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌, కిచిడీల్లో పుదీనా లేకపోవడాన్ని కనీసం ఊహించలేం కదూ! దీన్ని ఆలుగడ్డ, బీన్స్‌ లాంటి ఏ కూరల్లో వేసినా అదనపు రుచి వస్తుంది

TV9 Telugu

గోంగూర పచ్చడితో పోటీ పడేలా మహత్తరంగా ఉంటుంది పుదీనా చెట్నీ. రంగూ రుచీ వాసనలతో మురిపించడమే కాదండోయ్‌, ఆరోగ్యానికి దోహదం చేసే ఔషధ గుణాలూ ఉన్నాయిందులో..

TV9 Telugu

పుదీనాలో ఎ-విటమిన్‌, ఐరన్‌, మెగ్నీషియం తదితరాలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం. పాలిచ్చే తల్లులకు ఆ భాగంలో నొప్పి కలగడం, చనుమొనలు వాచినట్టుగా ఉండటం, పగుళ్లు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి

TV9 Telugu

ఈ సమస్యకు పుదీనా ఆకులను నూరి అక్కడ రాయడం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల సాధారణ జలుబు ఇట్టే తగ్గుతుంది

TV9 Telugu

ఇది నాసల్‌ డ్రాప్స్‌కు ప్రత్యామ్నాయం కాకున్నా జలుబుతో ముక్కు పూడుకుపోయినప్పుడు పుదీనా తైలాన్ని వాసన పీల్చడం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తగ్గుతుంది. పుదీనా పరిమళంతో అరోమా థెరపీలు చేస్తున్నారు. దీనితో రూపొందించిన పెప్పర్‌ మింట్‌ ఆయిల్‌ను రోజుకు ఐదు నిమిషాల చొప్పున కొన్నాళ్లు పీల్చడం వల్ల శారీరక ప్రయోజనాలతో బాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది

TV9 Telugu

దీనితో మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేలింది. దాంతో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలకు నడుం బిగించారు. విటమిన్ బి-12 లోపం నయమవుతుంది