వారానికొక్కసారి డ్రాగన్ ఫ్రూట్ తింటే.. క్యాన్సర్‌, గుండె జబ్బులు పరార్‌!

06 February 2025

TV9 Telugu

TV9 Telugu

డ్రాగన్‌ ఫ్రూట్‌... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ విదేశీ పండు చర్చే. ఇప్పుడు మన దగ్గరా విస్తారంగా లభిస్తున్నాయి. ఆ పండులో ఉండే పిటయా అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ ముప్పుని అడ్డుకుంటాయట

TV9 Telugu

ఇక, ఇందులోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌ యాసిడ్, ఆస్కార్బిక్‌ యాసిడ్, ఫైబర్‌ వంటివి చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ని మెరుగుపరుస్తాయి

TV9 Telugu

దీని గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచితే, మెగ్నీషియం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు, పీచు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాదు.. బరువూ అదుపులో ఉంటుంది

TV9 Telugu

అందుకే డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫుడ్ అంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు వారానికి ఒకసారైనా ఈ పండు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ఈ పండులో ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్,  ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్, క్యాన్సర్, డెంగ్యూ, కడుపు సంబంధిత సమస్యలన్నింటి నుంచి రక్షిస్తుంది

TV9 Telugu

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో పాటు, ఈ పండులో విటమిన్లు బి1, బి2, బి3 కూడా ఉంటాయి

TV9 Telugu

మీరు ప్రతిరోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే, మీ గుండె, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు, మలబద్ధకం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి

TV9 Telugu

ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తాయి