వేరుశనగ వీరికి విషంతో సమానం.. తిన్నారంటే షెడ్డుకే.!

Velpula Bharath Rao

26 December 2024

నట్స్ తింటే ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుగూ ఉంటారు. దీంతో నట్స్ తినడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు

ముఖ్యంగా మనకు నట్స్ అంటే గుర్తుకు వచ్చేది..వేరుశనగలు..ఎందుకుంటే నట్స్‌లో అన్నింటి కంటే ఇవే చీప్ అండ్ బెస్ట్ కాబట్టి.

ఈ పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ B6, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఇందులో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు వీటిని తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు.

అయితే ఈ పల్లీలో చాలా పోషకాలు ఉన్నాయి.ఇన్ని తింటే అందరీకి పడవు. కొన్ని సార్లు ఇవీ ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది.

ముఖ్యంగా పీనట్ అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిది. ఎవరికైతే వేరుశనగ తింటే అసౌకర్యంగా అనిపిస్తుందో వారు దూరంగా ఉంటే మంచిది.

ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉంటే మంచిది. గుండెల్లో మంటతో బాధపడేవారు కూడా వేరుశనగా తీసుకోకుంటే మంచిది.