వేసవిలో మామిడి జ్యూస్ మంచిదే.. కానీ వీరికి మాత్రం యమ డేంజర్!
14 April 2025
TV9 Telugu
TV9 Telugu
కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదుకు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట! అయితే కేవలం తినడం వల్లే కాదు.. మామిడి షేక్ కూడా తయారు చేసుకుని తాగవచ్చు
TV9 Telugu
మండే వేడిలో శరీరాన్ని చల్లబరచడానికి, శక్తిని కాపాడుకోవడానికి రకాల ఆరోగ్యకరమైన పానీయాలను తాగుతుంటాం. అందులో మ్యాంగో షేక్ కూడా ఉంటుంది
TV9 Telugu
మామిడిలో విటమిన్ సి, ఎ, ఫైబర్ అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా మామిడి ఉపయోగపడుతుంది
TV9 Telugu
ఇక మామిడి, పాలు, చక్కెరతో తయారు చేసిన మ్యాంగో షేక్ చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసవిలో అలసటను తగ్గిస్తుంది
TV9 Telugu
కానీ కొన్నిరకాల ఆరోగ్య సమస్యలున్నవారు ఈ మ్యాంగో షేక్ అస్సలు తాగకూడదు. ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు
TV9 Telugu
ఇందులో సహజ చక్కెర ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న రోగులు దీనిని తాగకుండా ఉండాలని అన్నారు. ఇందులో అధిక కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని తాగకూడదు
TV9 Telugu
గ్యాస్, అసిడిటీ, కాలేయ సంబంధిత సమస్యల విషయంలో దీనిని తాగకపోవడమే బెటర్. అలాగే మ్యాంగో షేక్ పరిమిత పరిమాణంలో తీసుకుంటేనే దాని వల్ల ప్రయోజనాలు పొందుతారు
TV9 Telugu
దీనిని అతిగా తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం. అలాగే మ్యాంగో షేక్‌లో ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే వినియోగించాలి