ఆరోగ్యానికి మంచిదని పుచ్చకాయ తెగ తింటున్నారా? ఐతే మీరు కైలాసానికే..
02 May 2025
TV9 Telugu
TV9 Telugu
వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే వాటిల్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో వందకు పైగా రకాలున్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర ఐదారు రకాలు మాత్రమే దొరుకుతాయి. వీటి సుగుణాలు మాత్రం ఆపారం
TV9 Telugu
పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, బి6, కె, మాంగనీస్, బీటా-కెరోటిన్, పొటాషియం, భాస్వరం, జింక్, రాగి, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఫైబర్, సహజ చక్కెర, లైకోపీన్, అనేక యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
TV9 Telugu
పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనినిఅధికంగా తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గ్యాస్, అపానవాయువు, విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీన్ని అధికంగా తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం తగ్గుతుంది. ఇది బలహీనత, తలతిరుగుడు, కండరాల ఒత్తిడికి కారణమవుతుంది
TV9 Telugu
పుచ్చకాయలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉండి, పుచ్చకాయను ఎక్కువగా తింటే, అది మీ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో తినాలి
TV9 Telugu
కొంతమందికి పుచ్చకాయ అలెర్జీ ఉంటుంది. దీని వలన పెదవులపై దురద, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు పుచ్చకాయకు దూరంగా ఉండటం బెటర్
TV9 Telugu
పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే దీనిని తీసుకోకపోవడమే మంచిది. దీనిలోని అధిక పొటాషియం గుండె, మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది